శనివారం ఉదయం కడప నగర టిడిపి అధ్యక్షుడుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమీర్ బాబు జిల్లా ఎస్పీని కోరారు. శనివారం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజును కలిసి దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని, కడప నగరంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు.