AP: రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విశాఖపట్నం- అరకు మార్గంలో నాలుగు లైన్ల హైవేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలోనే పెందుర్తి- బౌడరా నాలుగు లైన్ల రహదారి పనులకు కూడా మోక్షం లభించింది.రూ.956.21 కోట్లతో ఈ విస్తరణ పనులు చేపట్టనున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ నాలుగు లైన్ల రహదారి విస్తరణకు టెండర్లు పిలవనున్నారు. ఖరారు ప్రక్రియ, భూసేకరణకు సమయం పట్టనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa