తుఫాన్ నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని, పంట సంరక్షణకు చర్యలు చేపట్టాలని సాలూరు మండల వ్యవసాయాధికారి అనురాధ పండా మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. తుఫాన్‌తో బుధ, గురు, శుక్ర వారాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. పత్తి పొలాల్లో ఉంటే సేకరించి జాగ్రత్త చేసుకోవాలన్నారు. మొక్కజొన్న గింజలు తడవకుండా భద్రపరచుకోవాలన్నారు. తుఫాన్‌తో వరి పంటకు నష్టం వాటిల్లే అవకాశాలు తక్కువని అన్నారు.