రైలులో రిజర్వేషన్ చేసుకున్న సీటులో వేరేవారు కూర్చుని, ఖాళీ చేయకపోతే సదరు ప్రయాణికుడు టీటీఈ (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్)ని సంప్రదించవచ్చు. అలాగే రైల్ మదద్ (RailMadad) పోర్టల్/యాప్లో కూడా ఫిర్యాదు చేయవచ్చు.
యాప్లో ఫిర్యాదు అందాక సీటును టీటీఈ ఖాళీ చేయిస్తారు. ఫిర్యాదు వచ్చిన 28 నిమిషాల్లోనే ఈ సమస్యను పరిష్కరిస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. రైల్వే హెల్ప్ లైన్ నంబర్ 139కి కాల్ చేసి కూడా ఫిర్యాదు చేయొచ్చు.