ప్రస్తుత సార్వా సాగు ఆరంభంలోనే వరి నారు, నాట్లు నీట మునిగి రైతులు నష్టపోయారు. జూలైలో దెబ్బతిన్న నాట్లు దెబ్బతినడంతో ఆగస్టులో రైతులు మళ్లీ నాట్లు వేశారు. మరోసారి వర్షాలు ముంచడంతో రైతులు నష్టపోయారు. ఆగస్టులో దెబ్బతిన్న పంటకు నష్టపరిహారం చెల్లించినా జూలైలో దెబ్బతిన్న పంటకు నేటికీ పరిహారం అందలేదు. ప్రభుత్వం సహకారం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. సార్వా సాగు చేపట్టిన జూలైలో 4వేల ఎకరాల్లో నారు, 13,084 ఎకరాల్లో నాట్లు దెబ్బతిన్నాయి. నారుమడులకు 80 శాతం సబ్సిడీతో 3,293 క్వింటాళ్ల విత్తనాలు అందించారు. 1308 ఎకరాలకు సంబంధించి 9,918 మంది రైతులకు నష్ట పరిహారం రూ.9 కోట్లుగా వ్యవసాయాధికారులు నివేదిక పంపించారు. ఆ సాయం ఇంకా రైతులకు అందలేదు. ఆగస్టులో వర్షాలకు మరో 3,562 ఎకరాలు దెబ్బతిన్నాయి. దీనిపై నష్టపరిహారం 6312 రైతులకు రూ.8.90 లక్షలు వారి ఖాతాలలో పడింది. ముందు నష్టం అందకపోవడం వెనుక నష్టం రైతులకు పరిహారం అందడం రైతులలో చర్చనీయంశంగా మారింది. ముందు దెబ్బతిన్న నష్టపరిహారం కోసం రైతులు అధికారులను అడిగే పనిలో పడ్డారు.