విజయనగరం జిల్లా, గుర్ల డయేరియా పరిస్థిపై హోంమంత్రి అనిత స్పందించారు. డయేరియా ప్రబలిన దగ్గర నుంచి మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని తెలిపారు. డయేరియా ప్రబలైన తర్వాత మరణాలు సంభవించడం బాధాకరమని అన్నారు. వారు ఎలా చనిపోయారనే విషయంపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని తెలిపారు. బోర్లలో బ్యాక్టీరియా ఉన్నందున ట్యాంక్‌ల ద్వారా వాటర్ సరఫరా చేస్తున్నామని వివరించారు. తమ ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలతో గత మూడు రోజులనుంచి కొత్త కేసులు నమోదు కాలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నాయకుల తీరుతో అధికారులు కూడా కొంత నిర్లక్ష్యం వహించారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. వాటర్ పైప్ లైన్‌లు మురుగు నీటి కాలువల్లో ఉన్నాయని అన్నారు.
వైసీపీ ప్రభుత్వం చెత్త మీద మాత్రం పన్ను వేసింది కానీ చెత్త ఎత్తలేదని విమర్శించారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కి సడన్‌గా ప్రజల మీద ప్రేమ పుట్టడం ఆశ్చర్యకరమని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఏపీలో చాలామంది డయేరియాతో చనిపోయిన, జగన్ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఒక్కరిని కూడా ఎందుకు పరిమర్శించలేదు? ఎందుకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించలేదు? అని హోంమంత్రి అనిత ప్రశ్నించారు.జగన్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం హూద్ హుద్ నుంచి చూస్తున్నామని… కానీ ఎక్కడా ఇవ్వలేదని అన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని బోర్‌వేల్స్, అన్ని వాటర్ ట్యాంక్‌లను శుభ్రం చేయాలని ఆదేశాలు జారీ చేశామని అన్నారు. గత ఐదేళ్లలో ఒక్క వాటర్ ట్యాంక్‌లో కూడా క్లోరినేషన్ జరగలేదని హోంమంత్రి అనిత చెప్పారు. గ్రామ పంచాయతీల నిధులు కూడా జగన్ దోచుకున్నారని విమర్శించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి సింపతీ క్రియేట్ చేయడం జగన్‌కి అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఆడపిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలన్నదే జగన్ ఆలోచన అని విమర్శించారు. అర్ధరాత్రి కల్లోకి ఏమొస్తే అదే మాట్లాడటం జగన్‌కి అలవాటుగా మారిందని హోంమంత్రి అనిత విమర్శించారు.