కేంద్ర ప్రభుత్వం ఏపీకి రైల్వే ప్రాజెక్టులు ప్రకటిస్తుంటే.. ఈరోజు జాతీయ రహదారులపైనా తాను రివ్యూ చేశానని సీఎం చంద్రబాబు తెలిపారు. రణస్థలం నుంచి శ్రీకాకుళం వరకు నాలుగు నుంచి 6 లైన్ల రహదారిగా చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆర్ అండ్‌బీసీఎల్‌ఆర్, సీసీఎల్‌ఏ , అటవీ ఇతర శాఖలతో ఓ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇసుక ఉచితంగా ఇస్తుండటంతో అన్ని రంగాలు బూస్టప్ అవుతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. 9987కిలోమీటర్ల జాతీయ రహదారులు ఏపీలో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఫోర్ లైన్‌వి ఎక్కువగా ఉన్నాయని సిక్స్ లైన్ రహదారులు తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఇకపై వీలయినంత వరకూ కోల్‌కతా నుంచి ఇచ్చాపురం వరకూ రహదారులను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుందని అన్నారు. నరసన్నపేట నుంచి రణస్థలం వరకు ఆరు లైన్ల రహదారి ఉందని గుర్తుచేశారు.
ఇప్పుడు రణస్థలం నుంచి శ్రీకాకుళానికి 6 లైన్లకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. కొన్నిరోడ్లను చాలా కారణాలతో నిలిపివేసిందని అన్నారు. ఫారెస్టు క్లియరెన్స్‌తోపాటు వేర్వేరు ప్రాజెక్టుల కింద 17 రహదారులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వివరించారు. జగన్ ప్రభుత్వంలో కేవలం 2 రహదారులు మాత్రమే పూర్తిచేసిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇప్పుడు రాష్ట్రంలో 95 ప్రాజెక్టులకు చాలా సమస్యలు ఉన్నాయని.. వాటిని మూడు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నేషనల్ హైవే అధికారులు, కాంట్రాక్టర్లు, రాష్ట్రప్రభుత్వ అధికారులతో ఈరోజు సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. అధికారులు కీలక విషయాలను తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. రూ. 18000 కోట్లతో పనులన్నీ పూర్తిచేయాలని కోరామని అన్నారు. ఈ పనులు త్వరగా పూర్తి అవుతాయని సీఎం చంద్రబాబు తెలిపారు.