జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ అంటే తమకు అభిమానమని, ఆయన సిద్ధాంతాలను గౌరవిస్తామని, అయితే తమ పోరాటం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, ఆయన తనయుడు ప్రణీత్‌రెడ్డిలపైనే అని టీడీపీ నాయకుడు ఎద్దు శశికాంత్‌భూషణ్ వెల్లడించారు. ఆదివారం ఒంగోలులోని ఎన్టీఆర్‌భ వన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత శుక్రవారం జరిగిన ఒంగోలు నియోజకవర్గం టీడీపీ విస్తృతస్థాయి సమా వేశంలో తాను చేసిన వాఖ్యలపై జనసేనజిల్లా అధ్యక్షుడు రియాజ్ స్పందించిన తీరు సరికాదన్నారు. తాము జనసేన పార్టీని గాని, పవన్‌కల్యా ణ్ సిద్ధాంతాలను వ్యతిరేకించలేదని చెప్పారు. అయితే బాలినేని వైసీపీలో మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉంటూ టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టి చేసిన అరాచకాలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరిచిపోరన్నారు.
టీడీపీ వారిపైనే దాడి చేసి, బాధితులపైనే కేసులు పెట్టిన బాలినేని, ఆయన తనయుడు నాడు అధికార వైసీపీని అడ్డుపెట్టుకుని చాలా చేశారని చెప్పారు. అయితే చేసిన త ప్పులు కాపాడుకునేందుకు నేడు టీడీపీ కూటమి లో భాగస్వామి జనసేనలో చేరితే తప్పులు ఒప్పులు కావన్నారు. అందులో భాగంగానే తాము మా ట్లాడినట్లు వివరించారు. వాస్తవాలు గుర్తించకుండా రియాజ్ మాట్లాడటం సరికాదన్నారు. పొత్తు ధర్మం పాటిస్తునే ఉన్నామని, కానీ పొత్తులో ఉ న్నప్పటికీ బాలినేనిపై మాత్రం తమ పోరాటం ఆగదన్నారు.నాడు టీడీపీ నాయకులు, కార్యక ర్తలపై కేసులు పెట్టి, నేడు జనసేనలో చేరితే బా లినేని సచ్చీలురవుతారా అని ప్రశ్నించారు. ఈ వి షయాన్ని గుర్తించాలని తెలిపారు. అపార్ధం చేసు కోవడం కాకుండా, అర్ధం చేసుకుంటే టీడీపీ శ్రే ణుల ఆవేదన అర్ధం అవుతుందని ఆయన పేర్కొ న్నారు. సమావేశంలో తెలుగు యువత అధ్యక్షు డు ముత్తన శ్రీనివాసరావు, పలువురు నాయకు లు పాల్గొన్నారు.