ఆముదాలవలస మండలం శ్రీనివాసాచార్యులపేట గ్రామంలో ఆముదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక కార్యకర్తలు, ప్రజలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం శ్రీనివాసచార్యులపేట గ్రామ పంచాయతీలో రూ. 49. 70లక్షల అంచనా వ్యయానికి సంబంధించిన రోడ్లు, కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.