ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబుపై ఆరోపణలు చేస్తే సహించేదిలేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 29, 2024, 06:19 PM

తప్పుడు ఆరోపణలు చేసిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీడీపీ కడప  జిల్లా ప్ర ధాన కార్యదర్శి వికాస్‌ హరిక్రిష్ణ కోరారు. సోమవారం అక్కాయపల్లెలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ నెల్లూరులో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినప్పటి నుంచి ఆయనకు మతిభ్రమించిందన్నారు.


జగన మెప్పు కోసం సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. వైఎస్‌ జగన, షర్మిల మధ్య ఆస్తి గొడవలు రోడ్డున పడడంతో షర్మిల వ్యాఖ్యలను ప్రజలు నమ్ముతున్న తరుణంలో అక్రమాస్తులు ఎక్కడ బయటపడతాయోనన్న ఉద్దేశ్యంతో విజయసాయిరెడ్డి వారి తప్పులను కప్పి పుచ్చుకోవడానికి సీఎంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. వైఎస్‌ మరణానికి రిలయన్స అధినేత కారణమని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిలయన్స ఆస్తులను ధ్వంసం చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారమంతా పక్కదారి పట్టించేదుకు విజయసాయిరెడ్డి నేరారోపణలు చేస్తున్నారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com