గుత్తి పట్టణంలో చారిత్రాత్మకంగా ప్రసిద్ధి పొందిన గుత్తి కోటను కేంద్ర పార్లమెంట్ పరిశోధన కమిటీ సభ్యులు ఎథినదీపక్, దివీతి సోమవారం సందర్శించారు. అప్పటి కలెక్టర్ సర్‌థామస్ మన్రో సమాధిని పరిశీలించారు. అనంతరం కోటపై పురాతన గుర్రపు శాల, మురారి రావు గద్దె, ఖిల్లా, చీకటి గదులు, బావులను, వివిధ కట్టడాలను పరిశీలించారు.
కోట సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయ్‌భాస్కర్, గైడ్ రమేష్ వారికి స్వాగతం పలికారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సూచనలతో వారు గుత్తి కోటను సందర్శించారని అన్నారు. కోట అఽభివృద్ధి కోసం ప్రణాళికను సిద్దం చేయడానికి వారు రావడం హర్షణీయమని అన్నారు. కార్యక్రమంలో కోట సంరక్షణ సమితి ఉపాధ్యక్షులు సుధాకర్, బాబాసాహెబ్, శేఖర్, పురావస్తు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |