యువత వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించుకోవాలని, నైపుణ్యం ఉన్న వారికే ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని స్కిల్ హబ్ కో ఆర్డినేటర్ సోమేశ్వరరావు, మాస్టర్ ట్రైయినీస్ యువరాజు, శ్రావణ్ లు అన్నారు.
ఈ మేరకు బుధవారం మందస మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నైపుణ్య గణన పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. స్కిల్ సెన్సెస్ పారదర్శకంగా నిర్వహించి, వివరాలను నైపుణ్య యాప్ లో నమోదు చేయాలన్నారు.