తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) కొత్త పాలక మండలిని నియమించారు. మొత్తం 24 మందితో టీటీడీ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మీడియా రంగానికి చెందిన బొల్లినేని రాజగోపాల నాయుడును బోర్డు చైర్మన్‌గా, వివిధ రంగాలకు చెందిన 23 మందిని సభ్యులుగా నియమించింది. బోర్డులో ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణకు ఎక్కువ ప్రాధాన్యం దక్కింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారికి బోర్టులో స్థానం లభించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టి్‌సగా పని చేసిన వ్యక్తిని తొలిసారి టీటీడీ బోర్డులో నియమించారు. మాజీ సీజేఐ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తును బోర్డు సభ్యుడిగా నియమించారు. టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు పలువురు నాయకులకు, జనసేన కోటాలో ముగ్గురికి స్థానం దక్కింది. మొత్తం 23 మంది సభ్యుల్లో ముగ్గురు మహిళలకు అవకాశం లభించింది.