డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తిరుపతి జిల్లాలో హత్యాచారానికి గురైన మూడున్నరేళ్ల బాలిక కుటుంబాన్ని శనివారం పరామర్శించిన ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో ఎన్నికల ముందు ఆడవాళ్లకు చిన్నా కష్టం వచ్చినా తొక్కి నార తీస్తానన్న పవన్ కళ్యాణ్.. ఇప్పటివరకు ఎంతమందిని తొక్కి నార తీశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నాలుగు నెలల్లో దాదాపు 100 మంది ఆడవాళ్లు చనిపోయారని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.