మధుమేహ బాధితులకు శుభవార్త. ఇన్సులిన్ డోసులో తేడాల కారణంగా రక్తంలో చక్కెర స్థాయులు పడిపోయే సమస్యకు చెక్ పెట్టే ‘స్మార్ట్ ఇన్సులిన్’ను శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేశారు. ఇంజెక్షన్ ఇవ్వగానే రక్తంలో కలిసిపోయి పని మొదలెట్టడం కాకుండా.. కాస్తంత ఆగి.. షుగర్ లెవల్స్ ఎలా ఉన్నాయో చూసి, తక్కువగా ఉంటే నిశ్శబ్దంగా ఉండి, ఎక్కువగా ఉంటే పనిచేసే తెలివైన ఇన్సులిన్ అన్నమాట!! ఇది అందుబాటులోకి వస్తే.. బాధితులు చాలావరకూ సాధారణ జీవితం గడిపే అవకాశం ఉంటుంది.