ఐటీ, ఎలకా్ట్రనిక్స్ పార్కుల్లో సమర్థ యాజమాన్య నిర్వహణను కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రవాణా వ్యయాలు తగ్గేలా పోర్టులు, విమానాశ్రయాలు, రహదారుల సదుపాయాలు రాష్ట్రంలో ఇప్పటికే ఉన్నాయని పేర్కొంది. విశాలమైన భూములు, మౌలిక సదుపాయాలతో కూడిన ఇండస్ర్టియల్ నోడ్‌లను అందుబాటులోకి తెస్తున్నామని పాలసీలో పేర్కొంది. ఉత్పత్తి రంగానికి చెందిన క్లస్టర్లకు అత్యుత్తమ లాజిస్టిక్ ఇన్‌ఫ్రా అందుబాటులో ఉందని వెల్లడించింది. విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.