నవంబర్ నెల నుంచే ప్రాధన్యతా ప్రాజెక్టుల పనులు ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించిన విషయం తెలిసిందే. సీఎం ఆదేశాలను అమలు చేసేందుకు మంత్రి నిమ్మల రామానాయుడు వరుస సమీక్షలు నిర్వహించారు. పోలవరం, వెలిగొండ, చింతలపూడి,గోదావరి-పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టులపై ఇరిగేషన్ ఉన్నతాధికారులు, ఏజెన్సీలతో విజయవాడ క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిపారు. ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, ఆయా ప్రాజెక్టుల సీఈలు, ఎస్ఈలు, మేఘా ఇంజనీరింగ్ ఏజెన్సీ ఈ సమావేశానికి హాజరయ్యారు.
రేపటి (బుధవారం) నుంచి పోలవరం ఢయా ఫ్రం వాల్, ఈసీఆర్ఎఫ్ నిర్మాణానికి సంబంధించి నిపుణులతో వర్క్ షాప్ నిర్వహణపై సమావేశంలో చర్చించనున్నారు. వెలిగొండ ప్రాజెక్టులో గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలను, దెబ్బతిన్న ఫీడర్ కెనాల్‌పై సమగ్ర రిపోర్టును తయారు చేసి సీఎం చంద్రబాబు నాయుడికి మంత్రి నిమ్మల రామానాయుడు అందివ్వనున్నారు.