కోడూరు శివారు నరసింహాపురం గ్రామంలోని ఎంపీయూపీ పాఠశాలలో నీచమైన ఘటన చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్న సమయంలో ఉపాధ్యాయుడు కటికల వేణుగోపాలరావు.. పాపను బెంచీపై కూర్చోబెట్టి డ్రస్పైకి లేపి తొడపై కొరికాడని, పాప ఏడ్వగా, విషయం ఎవరికైనా చెబితే కొడతానని, చంపేస్తానని బెదిరించాడని పాప తండ్రి తెలిపారు. సాయంత్రం ఇంటికి రాగా, స్నానం చేయించే సమయంలో తొడపై ఉన్న ఘాటు చూసిన తల్లి ప్రశ్నించగా, పాప విషయం చెప్పిందని పేర్కొన్నారు. కొన్ని రోజులుగా పాప పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తెలిపారు. అనంతరం కోడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా పాప మీడియాతో మాట్లాడుతూ కొన్ని రోజులుగా ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, ఎవరితోనైనా చెబితే కొడతానని, చంపుతానని బెదిరిస్తున్నాడని తెలిపింది. పాఠశాలలో పదిమంది విద్యార్థులే ఉన్నారని, వారిలో ఐదుగురే పాఠశాలకు వస్తారని, వేరొక టీచర్‌తో పాఠాలు చెప్పిస్తూ, ఈయన మాత్రం పాఠశాల ఆవరణలో మంచం వేసుకుని కాలక్షేపం చేస్తుంటాడని పాప తల్లిదండ్రులు ఆరోపించారు. ఇంటికి వచ్చిన తమ కుమార్తె పాఠశాలకు వెళ్లనని, అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని చంపేయమని ఏడ్చిందన్నారు. ఇలాంటి కామాంధ ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.