తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి. ఆర్ నాయుడును శనివారం తిరుపతిలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య కలిశారు. చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన బి. ఆర్ నాయుడుకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి పవిత్రతను కాపాడేందుకు తమ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బి. ఆర్ నాయుడుకు బాధ్యతలు అప్పజెప్పడం జరిగిందని ఎమ్మెల్యే మాల కొండయ్య తెలిపారు. భక్తులు ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకుంటున్నారని తెలిపారు.