వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి కూటమి ప్రభుత్వంపై 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా విమర్శలు గుప్పించారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు, కేసుల మీద కాకుండా రాష్ట్రంలో జరిగిన ఇలాంటి ఘటనపై దృష్టిసారించాలంటూ ఎన్‌టీఆర్ జల్లా పెనుగంచిప్రోలులో జరిగిన ఘటన తాలూకు పేపర్ క్లిప్‌ను పంచుకున్నారు. ఈ ఘటనలో ఏడాది బాలుడిని కుక్కల కరిచి చంపేశాయి. ఈ ఘటనపై అంబటి స్పందించారు. "వాడి మీద కేసు పెడదాం... వీళ్ళని బొక్కలో వేద్దాం... మొత్తాన్ని చితక్కొడదాం... అనే వాటి మీద నుంచి దృష్టి ఇలాంటి ఘోరాల మీద పెట్టండి. ఈ వార్త చదువుతుంటేనే హృదయం ద్రవిస్తోంది" అని ఆయన ట్వీట్ చేశారు.