సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంతుల మధ్య ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ అసెంబ్లీ సమావేశాల కోసం వెళ్లిన వరదరాజులరెడ్డికి మంగళవారం పుట్టిన రోజు కావ డంతో ఆయనకు సీఎం, డిప్యూటీ సీఎం స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. 84 ఏళ్ల వయస్సులోనూ ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఆరోగ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో, ఇతర సమీక్షా సమావేశాల్లోఅలుపెరగక పాల్గొ నడంపై అభినందించారు. ఈ వేడుకల్లో మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సవిత, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు పాల్గొన్నారు.