పొదుపు సంఘాల్లోని ఎస్సీ మహిళలకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఉన్నతి పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దీని కింద రూ.లక్షకుపైన రుణం తీసుకొని స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటు చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం పీఎం అజయ్ పథకం ద్వారా గరిష్ఠంగా రూ.50వేలు సబ్సిడీ కూడా ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని ఎస్సీ మహిళల ఖాతాలకు నేరుగా కేంద్రమే జమచేయనుంది. ఉన్నతి పథకం కింద వడ్డీలేని రుణం తీసుకున్న వారు దాన్ని పూర్తిగా తీర్చిన తర్వాతనే కేంద్రం ఇచ్చే సబ్సిడీ బ్యాక్ ఎండ్ విధానంలో అందుతుంది. ఈ పథకం కింద జిల్లాలోని 109 మంది ఎస్సీ మహిళలకు లబ్ధిచేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరికి ముందుగా వెలుగు ద్వారా ఉన్నతి పథకం కింద రుణాలు మంజూరు చేసి ఆ వివరాలను ఎస్సీ కార్పొరేషన్‌కు అందజే స్తారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పీఎం అజయ్ పథకం కింద సబ్సిడీని చెల్లిస్తారు.