సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి చాలా మంది అమాయకులు మోసపోతున్నారు. అయితే శుక్రవారం కేరళ పోలీసుకు అదేవిధంగా ఓ సైబర్ నేరగాడు కాల్ చేసి అడ్డంగా బుక్కై పోయాడు. పోలీస్ యూనిఫాంలో ఉన్న త్రిస్సూర్ సైబర్ సెల్ పోలీసుకు ఓ సైబర్ నేరగాడు కాల్ చేసి బెదిరించే ప్రయత్నం చేశాడు. దీంతో ఇక నీ పని మానుకో, నీ పని అయిపోయింది, నీ అడ్రస్ దొరికింది అంటూ.. సైబర్ నేరగాడికి ఆ పోలీసు అధికారి బుద్ధి చెప్పాడు. అది చూసిన సైబర్ నేరగాడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు