గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో దాదాపు 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛతర్‌పూర్ జిల్లా బిజావర్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. బస్టాండ్ సమీపంలోని ఓ చిన్న హోటల్‌లో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa