ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు ఖతార్ రాజధాని దోహా నగరం వేదికైంది. వంగూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు దోహాలో శుక్రవారం ఘనంగా ఆరంభమైంది. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ సదస్సును ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... తెలుగు గడ్డకు దూరంగా నివశిస్తున్నప్పటికీ భాషాభిమానంతో వంగూరి ఫౌండేషన్ ఈ సదస్సును నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సౌరభాలు వెదజల్లేలా సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. సదస్సులో దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ఆంధ్ర కళావేదిక అధ్యక్షులు భాగవతుల వెంకప్ప తదితరులు పాల్గొన్నారు.