కడప జిల్లా, వేంపల్లె ప్రాంతంలో రోడ్డు పక్కన ఎకరా భూమి రూ.4కోట్ల వరకు పలుకుతోంది. పాపాఘ్ని నదీ పక్కన హైవేరోడ్డుకు భూములు కోల్పోతున్న రైతులకు కనీసం రూ.30 లక్షలు ఇవ్వాలని టీడీపీ మండల కన్వీనర్ మునిరెడ్డి, మైనార్టీ కన్వీనర్ తెలంగాణ వల్లి, తహసీల్దార్ హరినాథ్‌రెడ్డిని కోరారు. హైవే రోడ్డులో భూములు కోల్పోతున్న యజమానులతో ఆదివారం సమావేశం నిర్వహించారు.
మార్కెట్ విలువ ప్రకారం మూడు రెట్ల ధరతో రైతులకు చెల్లిస్తామని తహసీల్దార్ వివరించగా రెండు విభాగాలుగా కేటాయించి రాజుకాలువ ప్రాంతంలో ఎకరాకు రూ.25లక్షలు, మిగిలిన చోట ఎకరాకు రూ.30 లక్షలు ఇవ్వాలని టీడీపీ నాయకులు కోరారు. జా యింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత వరకు రైతులకు న్యాయం చేస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు.