నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లపు ఊటను కలిగి ఉన్నా, రవాణాకు సహకరించినా చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ సురేఖ హెచ్చరించారు. కృష్ణా జిల్లా, కొయ్యూరు, మడిచర్ల గ్రామాల్లో గురువారం నిర్వహించిన దాడుల్లో చెరుకు తోటల్లో ఉంచిన సారా తయారీకి వినియోగించే 700 లీటర్ల బెల్లపు ఊటను సిబ్బందితో కలిసి ఆమె ధ్వంసం చేశారు. ఇద్దరిపై కేసులు నమోదు చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సురేఖ తెలిపారు. మద్యం షాపుల్లో ఎమ్మార్పీ ధరలకే మద్యం అమ్మాలని, లేకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.