సీడబ్ల్యూసీ సమావేశంలో నేతలకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే దిశా నిర్దేశం చేశారు. సీడబ్ల్యూసీ సమావేశంలో వాయనాడు లోక్సభ నుంచి విజయం సాధించిన ప్రియాంక గాంధీ, నాందేడ్ ఎంపీ రవీంద్ర వసంతరావు చహన్లకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ మెంబర్ పల్లంరాజు మాట్లాడుతూ. . నుదీర్ఘంగా సీడబ్ల్యూసీ సమావేశం 5 గంటల పాటు జరిగిందని.. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించామని అన్నారు. పలు అంశాలపై సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానం చేశామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవినీతి, ఇతర అంశాలపై చర్చించామని తెలిపారు.జమ్మూ హర్యానా, మహారాష్ట్ర, ఎన్నికల ఫలితాలపై ఈ సమావేశంలో చర్చ జరిగిందని అన్నారు.
రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు ఉన్నాయని.. వాటికి సంబంధించిన అంశాలపై కూడా చర్చించారని చెప్పారు. బీజేపీ మతపరమైన గొడవలు తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల విధానంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారం శైలి అధికార పార్టీకి అనుకూలంగా ఉందని ఆరోపించారు. గతంలో కూడా సీడబ్ల్యూసీ సమావేశంలో బ్యాలెట్ పేపర్ విధానం తీసుకురావాలని చర్చించామని అన్నారు. ఈవీఎం, వీవీప్యాట్ ట్యాలీ అయ్యే విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు.