ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రద్దీగా ఉన్న మార్కెట్లోకి బ్రా వేసుకుని వచ్చాడు.. ఇదేం పిచ్చిరా బాబు

national |  Suryaa Desk  | Published : Fri, Nov 29, 2024, 10:49 PM

ప్రస్తుతం సోషల్ మీడియా విచ్చలవిడిగా వాడుతుండటంతో రీల్స్ కోసం.. ఇన్‌ఫ్లూయెన్సర్‌లు ఎలాంటి పనులకైనా వెనుకాడటం లేదు. సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్, ఫాలోవర్లు పెంచుకునేందుకు ప్రమాదకరమైన స్థితిలో ఫోటోలు, వీడియోలు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇక జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా వీడియోలు చేస్తూ.. ఇతరులకు ఇబ్బంది కలిగించే ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ యువకుడు చేసిన పని.. అతడిని చావు దెబ్బలు తినేలా చేసింది. హర్యానాలోని పానిపట్‌ పట్టణంలో రద్దీగా ఉండే మార్కెట్‌కు వచ్చిన ఓ యువకుడు.. ఆడవాళ్లు వేసుకునే బ్రా వేసుకుని కనిపించాడు. అంతేకాకుండా రీల్స్ చేస్తూ.. నానా రచ్చ లేపాడు.


ఇక ఆ యువకుడు బ్రా వేసుకుని రావడంతో.. అక్కడికి వచ్చిన మహిళలు ఇబ్బంది పడుతూ కనిపించారు. షర్ట్ విప్పేసి కేవలం బ్రా మాత్రమే వేసుకున్న యువకుడు.. కింద ప్యాంట్ వేసుకున్నాడు. ఇక ఆ వేషంలో రీల్స్‌ చేస్తూ అకక్కడ నానా హంగామా చేశాడు. ఆ యువకుడు మార్కెట్లో చేస్తున్న హడావుడిని చూసిన వ్యాపారులు.. వెళ్లి అతడ్ని వారించారు. అయితే వారితో ఆ యువకుడు మొదట వాగ్వాదానికి దిగాడు. నిత్యం బిజీగా ఉండే మార్కెట్‌లో ఇలాంటి పిచ్చి చేష్టలు చేయవద్దని తీవ్రంగా మందలించారు. తనకు ఇష్టం వచ్చినట్లు చేసుకుంటానని పేర్కొన్నాడు. దీంతో వ్యాపారులు తీవ్ర ఆగ్రహంతో అతడిపై దాడి చేశారు. అప్పుడు ఆ యువకుడు దారికి వచ్చి.. తాను చేసిన పనికి క్షమాపణలు చెప్పాడు.


మొదట ఆ యువకుడు ఆ వ్యాపారుల మాటలు వినిపించుకోకుండా.. తాను ఒక ఫేమస్‌ యూట్యూబర్‌ అని.. తాను గతంలో కూడా ఇలాంటి వీడియోలు చాలా చేశానని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తన ఫాలోవర్లకు ఇలాంటి వీడియోలే ఇష్టమని పిచ్చి వాదనలు చేశాడు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రద్దీగా ఉన్న మార్కెట్‌లో ఆ యువకుడు చేసిన పనికి అంతా తిట్టిపోస్తున్నారు. అంతమంది జనం ఉన్న మార్కెట్లో ఇలాంటి అసభ్య వీడియోలు చేయడానికి సిగ్గు ఉండాలని ఫైర్ అవుతున్నారు. అక్కడ ఉన్న వ్యాపారులు.. ఆ యువకుడిని చితకబాది మంచి పని చేశారని పేర్కొంటున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com