పులివెందుల పట్టణ పరిధిలోని ఇస్లాంపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ను శనివారం ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజనం స్వయంగా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భోజనంలో నాణ్యతలో ఎటువంటి రాజీ పడొద్దని ఉపాధ్యాయులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.