అండర్-19 ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 47.1 ఓవర్లలో 238 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. పాక్ జట్టులో షాజైబ్ ఖాన్ (159) శతకంతో రాణించారు. భారత జట్టులో నిఖిల్ కుమార్ 67 రాణించారు. మిగతావారు విఫలమవ్వడంతో జట్టు ఓటమిపాలైంది.ఇటీవల ఐపీఎల్ వేలంలో సంచలనం సృష్టించిన 13 ఏళ్ల పిన్న వయసు ఆటగాడు వైభవ్ సూర్యవంశి నేటి మ్యాచ్ లో తీవ్రంగా నిరాశపరిచాడు. ఓపెనర్ గా బరిలో దిగిన ఈ బీహార్ టీనేజర్ 9 బంతులాడి చేసింది ఒక్క పరుగే. వైభవ్ సూర్యవంశి ఐపీఎల్ వేలంలో రూ.1.10 కోట్ల ధర పలికాడు. ఈ యంగ్ క్రికెటర్ కనీస ధర రూ.30 లక్షలు కాగా... రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ అతడిని కోటి రూపాయలకు పైగా ధరతో కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత చిన్న వయసు క్రికెటర్ గానే కాకుండా, చిన్న వయసులోనే కోటి రూపాయల చెక్ అందుకున్న ఐపీఎల్ క్రికెటర్ గానూ వైభవ్ సూర్యవంశి రికార్డు పుటల్లోకెక్కాడు.