భారతదేశంలో ప్రస్తుతం ప్రతి ఇంట్లో కూడా బైక్ కచ్చితంగా ఉంటుంది. రోజు వారీ అవసరాలకు, ఉద్యోగాలకు వెళ్లడానికి, కాలేజ్‌లు, షాపింగ్‌లు, ఇతర పనులకు బయటకు వెళ్లాలంటే టూవీలర్లు ఉండాల్సిందే.ఇండియాలో మధ్యతరగతి జనాభా ఎక్కువగా ఉంటుంది. అందుకే వారి అవసరాలకు ఉపయోగపడే తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులు ఎక్కువగా అమ్ముడుపోతుంటాయి. అయితే వీటి మెయింటెనెన్స్ కూడా సమయానికి సరిగ్గా ఉంటేనే బైక్ పనితీరు కూడా బాగుంటుంది. లీటర్ పెట్రోల్ ఇప్పుడు రూ.100 కు పైనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే రూ.120కి దగ్గరగా ఉంది. కాబట్టి ప్రతిరోజూ బైకును వాడే వారు పెట్రోల్‌కే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. రోజూ ఇతర నిత్యావసరాల కంటే కూడా బైక్ పెట్రోల్‌కే చాలా మంది ఉద్యోగులు తమ జీతంలో అధికంగా ఖర్చు చేస్తున్నారు.
నెలకు సగటున దాదాపు రూ.2500 నుంచి రూ.3500 వరకు కూడా పెట్రోల్‌కే ఖర్చు అవుతుంది. కొంతమంది తమ నెల జీతం అకౌంట్లో పడగానే బైక్ ట్యాంక్ మొత్తం కూడా నింపుకుంటారు. దాన్నే ఎక్కువ రోజులు వాడేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలాంటి వారు తమ బైక్ మైలేజ్ విషయంలో కీలక జాగ్రత్తలు తీసుకుని పెట్రోల్ తొందరగా అయిపోకుండా ముందు జాగ్రత్త పడతారు.
ఈ అంశాలను మీరు కూడా పాటించడం ద్వారా తరుచు పెట్రోల్ నింపుకునే అవసరం లేకుండా మొదటగా నింపిన పెట్రోల్‌ను ఎక్కువ రోజులు వాడుకుకోవచ్చు. ఆ జాగ్రత్తలను ఒకసారి చూసినట్లయితే, బైకులను కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మొదటగా మైలేజ్ విషయంపై దృష్టి పెట్టాలి. రోజూ ఒకే వ్యక్తి బైకును నడుపుతున్నట్లయితే అతనికి దాని గురించి పూర్తి అవగాహన ఉంటుంది.
బైక్ రోజూ ఎంత దూరం ప్రయాణిస్తుంది. అలాగే దానిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, లీటర్ పెట్రోల్ కొట్టిస్తే ఎంత వరకు వెళ్తుంది, వంటి అన్ని వివరాలపై కూడా ఒక అవగాహన ఉంటుంది. అదే ఇద్దరు వేర్వేరు వ్యక్తులు ఒకే బైకును నడిపినట్లతే మైలేజ్, సమస్యల గురించి ఇద్దరికి సరైన అవగాహన ఉండదు. దీంతో దాని పనితీరు చాలా వరకు తగ్గిపోతుంది.అందుకే ఇద్దరు వ్యక్తులు ఒకే బైకును నుడుపుతున్నట్లయితే ఒకే అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. వాహనాన్ని ఒకే వేగంతో మైలేజ్ ఇచ్చే రేంజ్‌లోనే నడపడం చాలా ముఖ్యం. వేగంగా డ్రైవింగ్ చేయడం వలన పెట్రోల్ వినియోగం ఎక్కువ పెరిగి మైలేజ్ చాలా వరకు తగ్గిపోతుంది. అదే తక్కువగా నిర్ణీత వేగంతో నడపడం వలన పెట్రోల్ తొందరగా అయిపోకుండా అందులో ఉన్న పెట్రోల్‌తో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు.మరో విషయం ఏమిటంటే, బైక్ నడిపిన వేగంతో పాటు రోడ్లు కూడా మైలెజ్‌పై ప్రభావం చూపిస్తాయి. మంచి నాణ్యమైన రోడ్లపై డ్రైవింగ్ చేయడం వల్ల పెట్రోల్ ఆదా అవుతుంది. సాఫీగా ఉన్న రోడ్లపై బైక్ ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రయాణించడం వల్ల మైలేజ్ ఎక్కువగా వస్తుంది. అదే గరుకుగా లేదా ఎత్తుపల్లాలు, రాళ్ల వంటి రోడ్లపై డ్రైవింగ్ చేయడంతో గేర్ మార్చిన ప్రతిసారి ఇంజిన్ ఎక్కువ పెట్రోల్‌ను తీసుకుంటుంది.తరుచుగా గేర్ మార్చడం వలన క్లచ్‌ను కూడా పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో సాధారణంగా బైకులు ఎక్కువ పెట్రోల్‌ను ఉపయోగించుకుంటాయి. దీంతో పెట్రోలో వేగంగా అయిపోతుంది. బైక్ మైలేజ్‌కి టైర్ గాలికి కూడా దగ్గరి సంబంధం ఉంది. టైర్లలో గాలి సరిపడినంతా ఉంటే ఇంజిన్‌పై ఒత్తిడి తగ్గి మైలేజ్ ఎక్కువగా వస్తుంది. అదే తక్కువ గాలి ఉన్నట్లయితే ఒత్తిడి పెరిగి మైలేజ్ తగ్గుతుంది