ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో అప్పటి ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి వేసిన ముందస్తు బెయిల్‌పై ఈరోజు (మంగళవారం) జిల్లా కోర్ట్‌లో విచారణకు వచ్చింది. ఈ కేసులో తమను ఇంప్లీడ్ చేయాలని రఘురామ కృష్ణ రాజు పిటిషన్ వేశారు. రఘురామ తరపున హైకోర్ట్ న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ పిటిషన్ వేశారు. రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగంలో ప్రభావతి కూడా హత్యాయత్నంలో భాగస్వాములు అయ్యారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. రఘురామ కృష్ణం రాజును పరీక్షించిన వైద్య బృందం ఆయన కాలుపై బలమైన దెబ్బలు ఉన్నాయని నివేదిక ఇచ్చారని న్యాయవాది తెలిపారు.
ఆయన రెండు కాళ్ళకు బలమైన దెబ్బలతో పాటు వాచి ఉన్నాయని పిటిషనర్ వెల్లడించారు.వైద్య బృందం ఇచ్చిన నివేదికను టాంపరింగ్ చేశారని, అందుకు భిన్నంగా నివేదిక ఇవ్వడం లో ప్రభావతి కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. బైపాస్ సర్జరీ చేయించకున్న అని చెప్పినప్పటికీ గుండెలపై కూర్చొని బాధారని చెప్పినప్పటికీ ప్రభావతి ఈ అంశాన్ని తొక్కి పెట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువలనే ఆమెకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని పేర్కొంటూ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతించాలని న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ కోరారు.