ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంబేడ్కర్‌ జంక్షన్‌ లో అంబేడ్కర్‌ విగ్రహమెక్కడ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 03, 2024, 08:41 PM

విజయనగరం, వీరఘట్టం మెయిన్‌ రోడ్డులో గతంలో అంబేడ్కర్‌ విగ్రహం ఉండేది. ఈ జంక్షన్‌ను అంబేడ్కర్‌ జంక్షన్‌ అని పిలిచేవారు. అయితే గతంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఈ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారు. రోడ్డు నిర్మాణం పూర్తయి సుమారు ఏడు నెలలు కావస్తున్నా ఆ విగ్రహాన్ని తిరిగి పునరుద్ధరించలేదు. ఈనేపథ్యంలో కేవీపీఎస్‌ నాయకులు సోమవారం ఆ జంక్షన్‌ను పరిశీలించారు. రోడ్డు నిర్మాణం పూర్తయినా విగ్రహాన్ని పునరుద్ధరించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం విగ్రహాన్ని కూడా సక్రమంగా భద్రపర్చలేదన్నారు. ఇదేనా.. రాజ్యాంగ నిర్మాతకు ఇచ్చే గౌరవం అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్‌ నాయకులు కె.సింహాచలం, శశిభూణ్‌ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com