రాజమహేంద్రవరంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దళిత యువకుడు పులి సాగర్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పోలీసులు వ్యవహరించిన అమానవీయ ఘటనపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ ను పులిసాగర్ కలిశారు. రాజమహేంద్రవరంలో పోలీసులు తనపై వ్యవహరించిన అమానవీయ ఘటనను దళిత యువకుడు పులి సాగర్ వైయస్ జగన్‌కు వివరించారు. పులి సాగర్‌కు పూర్తిస్ధాయిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని పార్టీ నేతలకు వైయస్ జగన్ సూచించారు.