మన్యం జిల్లాలో సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు అతి త్వరలో జరగనున్న నేపథ్యంలో గురువారం పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు వైసీపీ నాయుకులతో సమావేశం ఏర్పాటు చేశారు.
తన క్యాంప్ కార్యాలయంలో సీతానగరం, పార్వతీపురం మండలాల పార్టీ ముఖ్య నాయకులతో మాట్లాడుతూ. పార్టీ శ్రేణులంతా కూడా నీటి సంఘాల ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అలాగే ఎన్నికల ప్రక్రియపై దిశా నిర్దేశం చేశారు.