నెల్లిమర్ల మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తంగుడుబిల్లి విద్యార్థులు గురువారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు ఆహ్వాన పత్రికలను తయారు చేశారు. పాఠశాల గణిత ఉపాధ్యాయులు శివుకు బంగారయ్య విద్యార్థులచే ఆహ్వాన పత్రికలు తయారు.
చేయించి 7వ తేదీన పాఠశాలలో జరిగే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు ఆహ్వానించేటట్లు ప్రధానోపాధ్యాయుల సంతకంతో తల్లిదండ్రులకు పంపించారు. విద్యార్థుల సృజనాత్మకతను ఉపాధ్యాయులు అభినందించారు.