విజయనగరం జిల్లా గుర్ల మండలం, గూడెం గ్రామంలో తుఫాను కారణంగా తడిచి పాడైన పంటను జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గురువారం పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులకు ధైర్యం చెప్పారు.
తుఫాను బారిన పడి దెబ్బతిన్న రైతులను ఆదుకోవడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం విఫలమయిందన్నారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి రైతులను ఆదుకొవాలన్నారు.