మెంటాడ మండలం ఆగూరు గ్రామంలో గురువారం ఎంపీడీవో కూర్మనాథ్ పట్నాయక్ ఆధ్వర్యంలో గ్రామ సందర్శన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో వ్యక్తి గత మరుగు దొడ్లు వినియోగంపై ఆరా తీసారు.
వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాలువలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పారిశుధ్యం మెరుగుపరచి ప్రజలు వ్యాదులు భారిన పడకుండా చూడాలని అన్నారు.