అనంతపురం జిల్లా రాయదుర్గం శివారులో రైలు నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మెడికల్ సీటు రాలేదని మనస్తాపంతోనే యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కర్ణాటకలోని సేడంకు చెందిన తనూజ(20) చిత్రదుర్గలో చదువుతుంది. మెడికల్ సీటు రాకపోవడంతో ఇక తాను బతకలేనని తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా చెప్పింది. నిన్న సొంతూరికి వెళ్తూ రాయదుర్గం వద్ద రైలు నుంచి దూకి చనిపోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.