నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా పాత కొత్త చెరువు గ్రామానికి చెందిన సురేంద్ర(26) అనే యువకుడు తొమ్మిది మంది స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లారు.
యాగంటిలో దర్శనానంతరం పెద్ద కోనేరులో ఈత కొడుతూ, నీటి లోపల ఎక్కువ సేపు ఎవరూ ఉంటే వాళ్లే గెలిచినట్లు అని స్నేహితులు పందెం వేసుకున్నారు. దీంతో సురేంద్ర కోనేరు అడుగు భాగంలోకి వెళ్లగా.. ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు.