ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. అయితే ఈ రైల్వే లైన్ ఆంధ్రప్రదేశ్‌ను, పక్కన ఉన్న తమిళనాడును కలిపేలా రైల్వే శాఖ చేపడుతోంది. ఏపీలోని చిత్తూరు జిల్లా పుత్తూరు నుంచి, తమిళనాడులోని అత్తిపట్టు వరకూ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తున్నారు. అత్తిపట్టు- పుత్తూరు రైల్వే లైన్ ఏర్పాటు కోసం కోసం కేంద్రం కూడా ఇప్పటికే ఆమోదం తెలపగా.. భూసేకరణ చేపట్టనున్నారు. ఈ భూసేకరణ పనుల కోసం రైల్వే శాఖ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తమిళనాడులోని పోర్టు ప్రాంతమైన అత్తిపట్టును, పుత్తూరును అనుసంధానించేలా ఈ అత్తిపట్టు- పుత్తూరు రైల్వే లైన్ ప్రాజెక్టు డిజైన్ చేశారు. 88.3 కిలోమీటర్ల మేరకు అత్తిపట్టు - పుత్తూరు రైల్వే లైన్ నిర్మాణం జరగనుంది. పుత్తూరు- అత్తిపట్టు రైల్వే లైన్ పూర్తయితే తిరువల్లూరు- పుత్తూరు రైల్వే మార్గంలో రద్దీ తగ్గుతుంది. అలాగే ఎన్నూర్ పోర్టుకు ఇనుప ఖనిజం తరలింపునకు ఇదే దగ్గరి దారి కానుంది. అత్తిపట్టు - పుత్తూరు రైల్వే లైన్ ప్రయాణికుల రవాణా కంటే సరుకు రవాణా, కంటైనర్ రవాణాకు చాలా ముఖ్యమైంది. అయితే అత్తిపట్టు పుత్తూరు రైల్వే లైన్‌కు ఎప్పుడో కేంద్రం ఆమోదం లభించినా.. పనులు మాత్రం ముందుకు జరగడం లేదు.అయితే తాజాగా అత్తిపట్టు పుత్తూరు రైల్వే లైన్ నిర్మాణ పనుల కోసం భూసేకరణకు రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉంది.
మరోవైపు అత్తిపట్టు పుత్తూరు రైల్వే లైనుకు 189 హెక్టార్ల భూములు అవసరం అవుతాయని అంచనా. ఎగుమతులు, దిగుమతుల విషయంలో చెన్నై పోర్టుపై ఒత్తిడిని తగ్గించేందుకు అత్తిపట్టు పోర్టును కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ప్యాసింజర్ల అవసరాల కంటే సరుకు రవాణాకు ఈ మార్గంలో అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కర్నాటకలోని బళ్లారి నుంచి వచ్చే ఇనుప ఖనిజాన్ని పుత్తూరు అత్తిపట్టు రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే త్వరగా పోర్టుకు చేరవేసే అవకాశం ఉంటుంది. అలాగే పుత్తూరు అత్తిపట్టు రైల్వే లైన్ పూర్తయితే.. నారాయణవనం, పిచ్చాటూరు, నాగలాపురం మండలాల వాసులకు కూడా ప్రయోజనం ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభిస్తోంది. ఈ క్రమంలోనే అత్తిపట్టు పుత్తూరు రైల్వే లైన్ భూసేకరణ పనులకు కూడా రైల్వేశాఖ పర్మిషన్ ఇచ్చింది. దీంతో స్థానిక రైతులను సంప్రదించి భూసేకరణ చేపట్టనున్నారు.