పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. నెల్లిమర్లలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను ఆదివారం ఎమ్మెల్యే లోకం నాగ మాధవి తో కలసి ప్రారంభించారు.
పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం తక్కువ ధరకే పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తోందని కొనియాడారు. అన్న క్యాంటీన్ ను పేద ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఏపీ మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారు రాజు తదితరులు పాల్గొన్నారు.