AP: తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుంచి పారిపోయిన టెన్త్ విద్యార్థుల ఆచూకీ లభ్యమైంది. తిరుపతి నుంచి ధర్మవరం వైపు రైలులో పారిపోతున్న ముగ్గురు విద్యార్థులను అన్నమయ్య జిల్లా ములకలచెరువు వద్ద పోలీసులు గుర్తించారు. వారిచ్చిన సమాచారంతో ఈస్ట్ పోలీసులు తిరుపతికి తీసుకొచ్చారు. ఆదివారం అర్ధరాత్రి రవి శంకరాచారి, రానా, పవన్ అనే ముగ్గురు విద్యార్థులను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.