రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదని, ఈవీఎంల ప్రభుత్వమని ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఒంగోలులో చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ ప్రభుత్వం మాట్లాడితే కేసులు పెడుతోందన్నారు. పాలన గాలికొదిలేసి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుంచే పోటీచేస్తానని, జిల్లా ప్రజలతో మమేకం అవుతానని స్పష్టం చేశారు.