రైతాంగానికి అండగా నిలవాల్సిన సమయం వచ్చింది, వారి గొంతుకగా మనం ప్రభుత్వాన్ని నిలదీద్దామని వైయస్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన వైయస్ఆర్‌సీపీ ఉందనే మెసేజ్ బలంగా వెళ్ళాలి, ప్రజా సమస్యలపై ప్రభుత్వం దిగివచ్చేవరకూ మనం వారికి అండగా నిలుద్దామని సూచించారు. పార్టీ మండల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్లు, మునిసిపల్ ఛైర్‌పర్సన్‌లు, కౌన్సిలర్లు, జేసీఎస్ మండల ఇంఛార్జ్‌లకు ప్రజా పోరాటాలపై సజ్జల రామకృష్ణారెడ్డి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు.