రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పోలీసులు యథేచ్ఛగా చట్ట ఉల్లంఘన చేస్తున్నారని, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, ప్రైవేటు కేసులతో న్యాయస్థానంలో నిలబెడతామని వైయస్సార్‌సీపీ లీగల్‌సెల్ విభాగం అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి వెల్లడించారు. నెంబర్లు లేని వాహనాల్లో రౌడీల్లాగా పోలీసులు వస్తున్నారు. మఫ్టీలో వచ్చి వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా దళిత కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి కేసులు పెట్టి జైళ్లలో మగ్గబెడుతున్నారు. బెయిల్ ఇచ్చే కేసుల్లో, 41A నోటీసులు ఇవ్వాల్సిన చోట పోలీస్ మాన్యువల్ పాటించడం లేదు. పోలీసులకు ఈ లైసెన్స్ ఎవరు ఇచ్చారో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు.