రాష్ట్రంలో గిట్టుబాటు ధరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంను విజయవంతం చేయాలని కోరుతూ ‘అన్నదాతకు అండగా వైయస్ఆర్ సీపీ’ పేరుతో రూపొందించిన పోస్టర్ ను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలు ఆవిష్కరించారు. మాజీమంత్రులు అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లు లేళ్ళ అప్పిరెడ్డి, రుహుల్లా, మంగళగిరి వైయస్ఆర్ సిపి సమన్వయకర్త వేమారెడ్డి, మాజీ లిడ్ క్యాప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్, రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొ్మ్మూరి కనకారావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నారాయణమూర్తి, నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.