ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైయస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. అన్నదాత సుఖీభవ పథకం పేరుతో ప్రతి రైతుకు పెట్టుబడి సాయం రూ.20 వేలు ఇస్తామన్న చంద్రబాబు ఏ ఒక్క రైతుకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేదని ధ్వజమెత్తారు. రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వైయస్ఆర్‌సీపీ పోరాటానికి సిద్ధమైందని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.