కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా వైయస్ఆర్‌సీపీ ఎప్పుడూ ప్రజల పక్షమే అని వైయస్ఆర్‌సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తామని, ఈనెల 13న రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టాలని ఆయన సూచించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ ఆఫీసు నుంచి పార్టీ నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, రీజనల్ ఇంఛార్జులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సజ్జల మాట్లాడారు.